కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మార్పిడిపై సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య కొద్ది రోజులుగా ఘర్షణ జరుగుతోంది. ఈ ఘర్షణ చివరికి హస్తినకు కూడా చేరింది. రెండు వర్గాలకు చెందిన అధికారులు ఢిల్లీలో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఈ వ్యవహారం హైకమాండ్ పెద్దల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. తాజాగా సిద్ధరామయ్య సమావేశాలకు డీకే.శివకుమార్ దూరం జరిగినట్లుగా తెలుస్తోంది. అనారోగ్యమా? లేదంటే కావాలనే పక్కన పెట్టారా? అనేది తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ఆ మాటే కేంద్ర పెద్దలకు కోపం తెప్పించింది.. ధన్‌ఖర్ రాజీనామా మిస్టరీ ఇదే!
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమావేశం ఏర్పాటు చేసి రూ.50 కోట్ల నియోజకవర్గ గ్రాంట్లపై చర్చించారు. ఎమ్మెల్యేలంతా హాజరు గానీ.. ఈ సమావేశానికి శివకుమార్ మాత్రం హాజరు కాలేదు. ఉద్దేశ పూర్వకంగానే డీకే.శివకుమార్‌ను పక్కన పెట్టారా? లేదంటే సిద్ధరామయ్యతో సంబంధాలు దెబ్బతిన్నాయా? అనే చర్చలు పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: YS Jagan Gets Big Relief: వైఎస్ జగన్‌కు భారీ ఊరట.. విజయమ్మ, షర్మిలకు షాక్..!
పార్టీని అధికారంలోకి నడిపించిన శివకుమార్‌ను పార్టీ సమావేశాలకు దూరం పెట్టడంపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయని ప్రజలు భావిస్తారని అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై హోంమంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ.. సిద్ధరామయ్యను సమర్థిస్తూ గతంలో ఇలాంటి సమావేశాలు చాలా జరిగాయని చెప్పుకొచ్చారు. అయితే అంతర్గత కలహాలు మాని కలిసి పని చేయాలని హైకమాండ్ సూచించింది. కానీ శివకుమార్‌ను పక్కన పెట్టి సిద్ధరామయ్య సమావేశాలు నిర్వహించడం ఎటువైపు పరిణామాలు దారి తీస్తాయో చూడాలి.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలతో సమావేశం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కాకుండా ముఖ్యమంత్రి విధానసౌధలోని తన చాంబర్‌లో సమావేశాలు నిర్వహించడం మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శివకుమార్‌ను నియంత్రణలోకి తీసుకురావడానికే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారంటూ చర్చ నడుస్తోంది.