Twitter: ట్విట్టర్ ఉద్యోగుల రాజీనామా.. “నేనేం వర్రీ కావడం లేదంటున్న” మస్క్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk’s tweet on employee resignation: ట్విట్టర్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ ని టేకోవర్ చేసుకున్న తరువాత కొత్త బాస్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులను తొలగించాడు. ఇదే విధంగా కంపెనీ కోసం “హార్డ్‌కోర్”గా కష్టపడేవారు, పనిగంటలతో సంబంధం లేకుండా పనిచేయాలంటూ ఉద్యోగులకు సూచించాడు మస్క్. లేకపోతే ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లవచ్చని సూచిస్తూ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించారు. అయితే ఎలాన్ మస్క్ వార్నింగ్ తో ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేస్తున్నారు. గురువారం వందలాది మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు.
Read Also: UN: పాకిస్తాన్ బుద్ధి వంకర.. స్ట్రాంగ్ రిఫ్లై ఇచ్చిన భారత్..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ఉద్యోగుల రాజీనామా గందరగోళ పరిస్థితుల్లో ట్విట్టర్ సోమవారం వరకు తన కార్యాలయాలను మూసేస్తూ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ వర్క్ ఫ్రం హోమ్ రద్దు చేశాడు. దీంతో పాటు ఫ్రీ పుడ్ తీసేశాడు, వర్క్-ఫ్రమ్-హోమ్ పాలసీకి అనేక మార్పులు చేశాడు.
The best people are staying, so I’m not super worried
— Elon Musk (@elonmusk) November 18, 2022
ఇదిలా ఉంటే ఉద్యోగుల ముకుమ్మడి రాజీనామాలపై ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. వందలాది మంది రాజీనామాలు చేస్తున్న సందర్భంలో కీలక ట్వీట్ చేశాడు. ‘‘నేనేం ఆందోళన చెందడం లేదని.. అత్యుత్తమ వ్యక్తులు మాత్రమే ఉంటారని’’ ట్వీట్ చేశారు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ని సొంతం చేసుకున్నాడు ఎలాన్ మస్క్. వచ్చీ రావడంతో నలుగురు కీలక ఉద్యోగులను తొలగించాడు. దీంతో పాటు బోర్డును రద్దు చేస్తూ.. తనే ఏకైక డైరెక్టర్ గా ఉన్నాడు. దీంతో పాటు ట్విట్టర్ బ్లూ టిక్ ,వెరిఫైడ్ ఖాతాల వారు నెలకు 8 డాలర్లు(ఇండియాలో రూ.719) చెల్లించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీలోని 7,500 మంది సిబ్బందిలో సగం మందిని తొలగించాడు. రానున్న రోజుల్లో మరెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!