Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Vijay Tvks Small Error Big Hurdle In Forming Tamil Nadu Government

Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..

Published Date :May 8, 2026 , 3:11 pm
By Venu Goapl Reddy
  • విజయ్‌ సీఎం కాకుండా ఆపింది ఆ ఒక్క తప్పే..
  • గవర్నర్‌కు ఇచ్చిన లేఖతోనే సమస్య..
  • అనుభవం లేకపోవడమే విజయ్‌ను దెబ్బతీసింది..
Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Vijay: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ టీవీకే పార్టీకి అధికారం ఆమడదూరంలో ఉంది. విజయ్‌కి రాజకీయాలు కొత్త కావడం, అనుభవం ఉన్న నాయకుల మద్దతు లేకపోవడంతో విజయ్ తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో, విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. కాబట్టి 107 స్థానాల బలమే టీవీకేకు ఉంది. మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే విజయ్ పార్టీకి మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా, మ్యాజిక్ ఫిగర్ 118కి కన్నా దూరంగా 112 వద్దే మెజారిటీ ఆగిపోతోంది. మెజారిటీ కోసం మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం.

ఇలా చేసుంటే సీఎం అయ్యేవారు:

Also Read

  • DRDO TARA Test: డీఆర్‌డీఓ స్వదేశీ 'తారా' కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
  • New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
  • Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ భవిష్యత్తును తేల్చనున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు.!
  • Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
Add as a preferred
source on google

ఇదిలా ఉంటే, ఈ అంకెల రాజకీయాలు ఇలా సాగుతుంటే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో విజయ్ అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ‘‘విజయ్ గవర్నర్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ సమర్పించిన లేఖ’’నే కారణం అని చెబుతున్నారు.

సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న పార్టీ నాయకుడు తమ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించి ప్రభుత్వ ఏర్పాటు హక్కును కోరుతారు. దీనికి గవర్నర్ అనుమతించి ఆ తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని చెబుతారు. అయితే, ఇక్కడ విజయ్ మాత్రం తన టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించారు. అప్పుడు కూడా బలం 112కు మాత్రమే చేరింది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. విజయ్ కాంగ్రెస్‌ను కలుపుకుని ‘‘కూటమి’’గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ భావించి ఉంటారు. అందుకే ముందు మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పారని విశ్లేషకులు చెబుతున్నారు.

అనుభవం లేకపోవడమే కారణం:

కేవలం అతిపెద్ద పార్టీ నాయకుడిగా గవర్నర్ ముందు విజయ్ క్లెయిమ్ చేసి ఉంటే, విజయ్ ఇప్పటికే సీఎం అయ్యేవారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి ఉండేవారు. మెరుగైన రాజకీయ సలహాదారుడు విజయ్ వెంట ఉండుంటే విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. విజయ్‌కి ఇదే తొలి ఎన్నికలు. స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేసిన అనుభవం టీవీకేకు లేదు. ప్రస్తుతం, టీవీకేలో అనుభవం ఉన్న వారు మాజీ అన్నాడీఎంకే నేత సెంగొట్టయాన్ మాత్రమే.

గవర్నర్ వ్యవహారశైలిపై భిన్నాభిప్రాయాలు:

ఇదిలా ఉంటే, గవర్నర్ వ్యవహారంపై మరికొందరు రాజకీయ నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్‌కు స్వతంత్ర నిర్ణయాధికారం ఉంటుందని చెబుతున్నారు. సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుగా ప్రీ-పోల్ కూటమి, తర్వాత అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AIADMK
  • congress
  • DMK
  • hung assembly
  • Tamil Nadu Election 2026

తాజావార్తలు

  • Vijay: ఆ ఒక్క తప్పు చేయకుంటే విజయ్ సీఎం అయ్యేవారు..

  • Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?

  • Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!

  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions