Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay-Trisha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో భారీ విజయాన్ని అందుకున్న దళపతి విజయ్, ప్రస్తుతం రాజకీయంగానే కాకుండా తన వ్యక్తిగత జీవితంతోనూ హాట్ టాపిక్‌గా మారారు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మరోవైపు నటి త్రిష కృష్ణన్‌తో ఆయనకున్న అనుబంధంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వింత పోస్ట్ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. తన వెనకాల గుసగుసలాడే వారికి కౌంటర్ ఇచ్చేలా “Blah Blah”, “IYKYK” అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే రాఖీ సావంత్ వంటి సెలబ్రిటీలు సైతం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని వ్యాఖ్యానించడం విశేషం. అయితే, గత 25 ఏళ్లుగా సంగీతతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్న విజయ్, ప్రస్తుతం ఆమెతో విడిపోతున్నారనే వార్తలు వస్తుండటం, అదే సమయంలో త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ మొత్తం వ్యవహారం కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో మొదలైన వీరి బంధంపై ఎన్ని ఊహాగానాలు వస్తున్నా, విజయ్, త్రిష మాత్రం ఇప్పటివరకు దీనిపై మౌనం వీడలేదు.
ఇదిలా ఉండగా.. తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఉత్కంఠ కొనసాగుతోంది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్నారా? లేదా? అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ విషయంలో ప్రతిష్టంభన వీడటం లేదు. వాస్తవానికి మే 9, 2026 (శనివారం) ఉదయం 11 గంటలకు జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భారీగా ప్రచారం జరిగింది. కానీ, చివరి నిమిషంలో చోటుచేసుకున్న రాజకీయ సమీకరణలు ఈ ప్రక్రియను సందిగ్ధంలో పడేశాయి. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాకపోవడంతో పొత్తుల రాజకీయం మొదలైంది. ఐదు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీవీకేకు బేషరతు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో విజయ్ ఇప్పటికే మూడంచెల కసరత్తు చేస్తూ, గత 48 గంటల్లో మూడుసార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇందులో వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలకు చెందిన ఇద్దరేసి ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని గవర్నర్‌కు వివరించారు. అయితే, ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. విజయ్ కేవలం 116 మంది ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించిన హార్డ్ కాపీలను మాత్రమే గవర్నర్‌కు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు వీసీకే పార్టీ తన నిర్ణయాన్ని ఈరోజు వెల్లడిస్తామని చెప్పడం, తొలుత మద్దతు ఇస్తుందని భావించిన ఐయూఎంఎల్ తాము ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేయడంతో లెక్కలు తలకిందులయ్యాయి. ఇదే సమయంలో సీపీఐ, సీపీఎంలు టీవీకేకు మద్దతు లేఖలు అందజేయడం విజయ్‌కు కాస్త ఊరటనిచ్చే అంశంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!