TVK Rally Stampede: తమిళ స్టార్ ,టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయం విమర్శలు ప్రతివిమర్శలకు కారణమవుతోంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. విజయ్ ర్యాలీలో విద్యుత్ అంతరాయం, అకాస్మత్తుగా జనసమూహం, ఇరుకైన స్థలం కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చే సరికి జనసమూహం పెరిగిందని, ఆయన ప్రచారం బస్సుతో మరికొంత మంది వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో చాలా మంది చెట్లు, కరెంట్ స్తంభాలు, ఇళ్ల పైకప్పులు ఎక్కినట్లు వెల్లడించారు. ఈ సమయంలో విద్యుత్ షాక్‌లను నివారించేందుకు అధికారులు కరెంట్ ను కట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.
Read Also: Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ సంచలన ప్రకటన.. మృతుల సంఖ్య పెరుగనుందా..?
‘‘విజయ్ రాగానే ప్రజలు ఒకర్ని ఒకరు తోసుకోవడం ప్రారంభించారు, విజయ్ దృష్టిని ఆకర్షించాలని కొందరు చెపపులు కూడా విసిరారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కిన వారిలో కొంత మంది కాలువల్లో పడిపోయారు. కొంతమంది స్పృహ కోల్పోయారు. వీరికి సాయం చేయడానికి వచ్చిన అంబులెన్సులు జన సమూహాన్ని దాటి రాలేకపోయాయి.’’ అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. అప్పుడే పోలీసులు జన సమూహాన్ని చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ చేసినట్లు మరొకరు పేర్కొన్నారు.
విజయ్ తన మార్గంలో వెళుతూ చేతులు ఊపుతూ ఉంటే, జన సమూహం అతడిని అనుసరించేది కాదని, ఇంత పెద్ద ఘటన జరిగేది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయ్ ప్రజల అరుపుల్ని కనీసం పట్టించుకోలేదని వెల్లడించారు. తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తన ‘‘హృదయం ముక్కలైంది’’ అని అన్నారు. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి టీవీకే రూ. 20 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది.