NBK 109: సారీ.. పండక్కి అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నాం: నాగవంశీ
- బాబీ దర్శకత్వంలో NBK 109
- విశేషంగా ఆకట్టుకున్న టీజర్
- టైటిల్ అనౌన్స్మెంట్ గురించి కీలక అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK 109’. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందని అందరూ ఆశించినా.. అది జరగలేదు. దీపావళికి వస్తుందని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
నిర్మాత నాగవంశీ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. పండక్కి అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నాం అని తెలిపారు. ‘సినిమా టైటిల్‌ను దీపావళి పండగకు విజువల్స్‌తో సహా రూపొందించి అనౌన్స్ చేద్దామనుకున్నాం. పోస్టర్లు వేస్తే ఆ కిక్ రాదు కాబట్టి వీడియో రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే వీడియో సీజీలతో మూడిపడి ఉంది. సీజీ సమయానికి డెలివరీ అవ్వలేదు. అందుకే పండక్కి అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నాం. అభిమానులకు సారీ చెబుతున్నా. వారం లేదా పది రోజులు సీజే కోసం సమయం పడుతుంది. నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇస్తాం’ అని నాగవంశీ చెప్పారు. లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో నాగవంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
Also Read: Gold Rates Hike: అప్పుడు 28 వేలు, ఇప్పుడు 81 వేలు.. బంగారం ధరలు పెరగటానికి కారణం ఏంటంటే?
ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. ఇదివరకు ఎన్నడు చూడని విధంగా బాలయ్య కనిపించబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. ఈ చిత్రంకు డాకు మహారాజ్, వీరమాస్, సర్కార్ సీతారాం ఇలా పలు రకాల టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!