NTV Telugu Site icon

Pune: ఫుడ్ నిరాకరించారని ట్రక్కు డ్రైవర్ బీభత్సం.. హోటల్, కారు ధ్వంసం

Lorryaccident

Lorryaccident

పూణెలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఫుడ్ ఇవ్వడానికి హోటల్ సిబ్బంది నిరాకరించినందుకు ట్రక్కుతో హోటల్‌ ముందు నానా బీభత్సం సృష్టించాడు ఓ డ్రైవర్. హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా అక్కడే నిలిపి ఉన్న కారును ఢీకొట్టాడు. దీంతో కారు డ్యామేజ్ అయింది. హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?

షోలాపూర్ నుంచి పూణెకు శుక్రవారం రాత్రి ఓ ట్రక్కు వచ్చి ఆగింది. హింగాన్‌గావ్‌లోని హోటల్ గోకుల్ ముందు ఆగాడు. తనకు ఆహారం ఇవ్వాలని అడిగాడు. అప్పటికే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అయితే హోటల్ యజమాని అతనికి ఫుడ్ పెట్టేందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనాన్ని పాడు చేయడం ప్రారంభించాడు. ఇష్టానురీతిగా ధ్వంసం చేశాడు. కారును కూడా పాడు చేశాడు. అక్కడే ఉన్న హోటల్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినా ఏ మాత్రం తగ్గలేదు. డ్రైవర్‌పై రాళ్లు కూడా విసిరారు. అయినా కూడా శాంతించలేదు. పదే పదే ట్రక్కుతో హోటల్‌ను ఢీకొట్టాడు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలు మొబైల్‌లో షూట్ చేశారు. అయితే టైర్లలో గాలి లేకపోవడంతో ట్రక్కు ముందుకు కదలలేదు. అక్కడే ఆపి.. తనకు ఫుడ్ పెట్టాలని చేతులు జోడించి బతిమాలాడు. అయితే డ్రైవర్‌పై కొందరు దాడి చేసే ప్రయత్నం చేయగా.. మరికొందరు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Tollywood : వినాయక చవితి కానుకగా టాలీవుడ్ స్పెషల్ అప్ డేట్స్..

Show comments