Honeymoon Murder Case: రాజా రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం.. నిందితురాలిపై కొత్త పిటిషన్!
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం
- రాజా రఘువంశీ కుటుంబం కీలక నిర్ణయం
- నిందితురాలిపై కొత్త పిటిషన్ దాఖలకు నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసులో బాధిత కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ.. భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలని బాధిత కుటుంబం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో నిందితురాలు సోనమ్‌కు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా నిందితురాలికి సహకరించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం షిల్లాంగ్‌లో న్యాయవాదిని నియమిస్తామని రాజా రఘువంశీ కుటుంబం తెలిపింది.
ఇది కూడా చదవండి: Kerala: కేరళలో షాకింగ్ ఘటన.. హత్యాచార ఖైదీ జైలు గోడ దూకి పరారీ
Also Read
- Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
- International Yoga Day: 12 ఏళ్లు పూర్తి.. అసలు జూన్ 21నే యోగా డే ఎందుకు జరుపుకుంటారు? చరిత్ర ఇదే!
- NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
- International Yoga Day 2026: కోల్‌కతాలో 35,000 మందితో కలిసి ప్రధాని మోడీ యోగా.. 2026 థీమ్ ఏమిటి?
రాజా రఘువంశీ హత్యకు గురైన ప్రాంతాన్ని బాధిత కుటుంబం సందర్శించింది. ఆ ప్రదేశంలోనే మతపరమైన ఆచారాలు నిర్వహించాలని కుటుంబం నిర్ణయం తీసుకుందని విపిన్ రఘువంశీ మీడియాకు తెలిపారు. వివాహం తర్వాత సోనమ్ తన భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో.. అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ఆమెకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజా రఘువంశీ కుటుంబం పిటిషన్ దాఖలు చేస్తుందని చెప్పారు.
ఇక సోనమ్ అన్నయ్య గోవింద్ ఆమె కోసం బెయిల్ దరఖాస్తు దాఖలు చేయడానికి షిల్లాంగ్, పొరుగున ఉన్న అస్సాంలోని గౌహతిలో న్యాయవాదిని నియమించుకోవాలని చూస్తున్నారని వర్గాలు తెలిపాయి. అయితే సోనమ్ కుటుంబం మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు.
ఇది కూడా చదవండి: PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
సోనమ్‌కు మే 11న ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో వివాహం అయింది. అయితే మే 20న హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులుతో చంపేసి లోయలో పడేసింది. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. జూన్ 2న లోయలో రాజా మృతదేహం లభించింది. ఇక జూన్ 7న పోలీసుల ఎదుట సోనమ్ లొంగిపోయింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

తాజావార్తలు
-
Box Office Trend :’పెద్ది’ని అధిగమించిన ‘అబ్సెషన్’… హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
-
Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ రిజెక్ట్ చేసి సాయిపల్లవి మంచిపని చేసింది
-
Vaibhav Sooryavanshi: రెచ్చగొడితే రచ్చరచ్చే.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ సూర్యవంశీ..
-
Mokshagna : నందమూరి మోక్షజ్ఞకు యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదా?
-
Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!