Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ రిజెక్ట్ చేసి సాయిపల్లవి మంచిపని చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ చిత్రం సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. సమంతా – నందిని రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అయితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ కథ మొదట నాచురల్ బ్యూటీ సాయి పల్లవి వద్దకు వెళ్ళిందని కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసిందని సమాచారం. దాంతో ఈ లక్కీ ఛాన్స్ సమంతా చేతికి వచ్చి ఇప్పుడు సామ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఈ కాస్టింగ్ చేంజ్ గురించే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సినిమాలో సమంతా నటన, ముఖ్యంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ‘మా ఇంటి బంగారం’లో సమంతాను చూసిన తర్వాత ఆ రకమైన పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్‌లలో సాయి పల్లవిని ఊహించుకోవడం చాలా కష్టమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సాయి పల్లవి ఎమోషనల్ అండ్ డ్యాన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో అదరగొట్టినప్పటికీ.. ఈ సినిమాలో డిజైన్ చేసిన రా అండ్ రస్టిక్ యాక్షన్ బ్లాక్స్‌కు సమంతా మాత్రమే పర్ఫెక్ట్ ఆప్షన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా సాయి పల్లవి నో చెప్పడం సమంతా నెత్తిన పాలు పోసినట్లయిందని అంటున్నారు. ఇక ఈ సినిమా సమంతా లైఫ్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రస్తుతం సమంతా తన జీవితంలో మదర్ ఫేజ్ లోకి అడుగుపెడుతున్న తరుణంలో ఇలాంటి ఒక భారీ కమర్షియల్ హిట్ అందుకోవడం నిజంగానే మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. కెరీర్ పరంగా ఇంతటి ఘన విజయాన్ని ఎంజాయ్ చేస్తూ వ్యక్తిగత జీవితంలో కొత్త చాప్టర్‌ను ప్రారంభించబోతుండటంతో అభిమానులు సామ్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..