NTV Telugu Site icon

Heavy rain alert: ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. లిస్టు విడుదల

Raeien

Raeien

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్, అస్సాం, మహారాష్ట్రల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Spirit: స్పిరిట్.. అంచనాలు పెంచేసుకోవద్దు.. జరిగితే మంచిదే!

ఇదిలా ఉంటే తాజాగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఐఎండీ జాబితా విడుదల చేసింది. జూలై 8 నుంచి 11 వరకు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, అస్సాం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Supreme Court: “పీరియడ్ లీవ్” పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీం..