Mumbai-Bound Vande Bharat Train Hits Cattle: ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత నాలుగోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. గుజరాత్ లోెని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదంతో రైలు ముందుభాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది.
Vande Bharat Express accident.. FIR against buffalo owners: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు గురువారం ప్రమాదం జరిగింది. ముంబై-గాంధీనగర్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గేదెల మందను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రైన్ ముందరి భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో గేదెల మరణించాయి. సెమీ హై స్పీడ్ రైలును ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ట్రైన్ ప్రమాదానికి గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.