Uttarakhand: ఉత్తరాఖండ్లో కోల్కతా లాంటి ఘటన.. నర్స్పై అత్యాచారం, హత్య
- ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం.. హత్య ఘటనను చేధించిన పోలీసులు
- అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన.. నిందితుడు ధర్మేందను అరెస్టు చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన జరిగి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయినప్పటికీ కామాంధుల కళ్లు కామంతో మూసుకుపోతున్నాయి. తాజాగా.. ఉత్తరాఖండ్ లో జరిగిన అత్యాచారం, హత్య ఘటనను పోలీసులు చేధించారు. అదృశ్యమైన 33 ఏళ్ల నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ధర్మేందను బుధవారం అరెస్టు చేశారు. ఈ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రాపూర్‌లో జూలై 30న జరిగింది.
Ajit pawar: అజిత్ పవర్ కీలన ప్రకటన.. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని వెల్లడి.. రంగంలోకి కుమారుడు?
Also Read
- karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
- Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
మృతురాలు.. నైనిటాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె బిలాస్‌పూర్ లో తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తుంది. కాగా.. బాధితురాలి సోదరి జులై 31న రుద్రాపూర్ పోలీస్ స్టేషన్‌లో తన సోదరి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఒక వారం తర్వాత.. నర్సు మృతదేహం ఉత్తరప్రదేశ్‌లోని దిబ్దిబా ప్రాంతంలో గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Army Dog Kent: ‘ఆపరేషన్ సుజలిగల’లో హీరోగా నిలిచిన జాగిలానికి శౌర్య అవార్డు..
నిందితుడు నర్సుపై అత్యాచారం చేసి, హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అరెస్టు చేశారు. అతను ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన కార్మికుడు. కాగా.. నిందితుడు ధర్మేంద్ర నర్సును పొదల్లోకి తీసుకెళ్లి మొదట అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తన ఒంటిపై ఉన్న నగలు తీసుకుని వెళ్లాడు. అయితే.. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీకి గురైన బాధితురాలి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేయడం ద్వారా నిందితుడు ధర్మేంద్రను పట్టుకున్నారు. విచారణలో.. నర్సుపై దాడి చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. అనంతరం ఆమెను ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి గొంతుకోసి హత్య చేసినట్లు తెలిపాడు. హత్య చేసిన తర్వాత పర్సులో ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
తాజావార్తలు
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
-
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..