ఒంటరిగా ఉంటున్న మహిళలపై ఎవ్వరు ఎప్పుడు దాడి చేస్తారో కూడా తెలియదు.. ఈరోజుల్లో మహిళలకు అస్సలు రక్షణ లేకుండా పోతుంది.. అప్పటిదాకా బాగున్న వారు.. మహిళలను చూడగానే ఒక్కసారిగా రాక్షసులుగా మారిపోతుంటారు..మాట వినని వారిపై దాడులు చేయడం, లైంగికంగా వేధించడం చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు యువకులు ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లారు. ఇన్నాళ్లకు అవకాశం దొరికిందంటూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు..ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది..
బండా ప్రాంతంలోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. పని నిమిత్తం ఎక్కువగా బయటి ప్రాంతాలకు వెళ్తుంటాడు.. అది గమనించిన వాళ్లు మహిళలను తమ దారిలోకి తెచ్చుకోవాలని అనుకున్నారు..సమయం కోసం వేచి చూస్తూ ఉండేవారు. ఇటీవల ఓ రోజు మహిళ భర్త పని మీద బయటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువకులు రాత్రి వేళ ఆమె ఇంటికి వెళ్లారు. నీ కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నాం..ఈరోజు శోభనం జరగాల్సిందే అంటూ రెచ్చిపోయారు..
ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అయితే వెంటనే తేరుకుని వారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా యువకులు ఆమెను వదలకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కర్ర తీసుకుని వారిపై దాడికి దిగింది. దీంతో భయపడి పోయిన యువకులు.. అక్కడి నుంచి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ ఎరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.. ఉదయం లేవగానే మహిళ భర్తతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.. నిందితులను పోలీసుకు వెతికే పనిలో ఉన్నారు..