uttar pradesh-Lakhimpur Kheri minor girls Incident: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరీ దళిత బాలికల హత్యా, అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనపై యోగీ ప్రభుత్వంపై బీఎస్పీ, ఎస్పీ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శల నేపథ్యంలో.. నిందితులను ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని.. యోగీ ప్రభుత్వం తప్పకుండా శిక్షించి తీరుతుందని.. హామీ ఇచ్చారు ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎంలు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు.
లఖీంపూర్ ఘటన విచారకరమని.. నేరస్తులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం హామీ ఇచ్చారు. దళిత బాలికలకు న్యాయం చేస్తామని.. నేరస్తుల్లో వణుకుపుట్టే విధంగా చర్యలు తీసుకుంటామని..ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని .. మరో డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ అన్నారు. అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ, మాయావతి రాజకీయాలు చేయకుండా కుటుంబాన్ని ఓదార్చాలని హితవు పలికారు కేశవ్ ప్రసాద్ మౌర్య.
Read Also: Kishan Reddy : ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ జిల్లాలో ఇద్దరు దళిత బాలికను అత్యాచారం, హత్య చేసి దారుణం చంపారు. చెట్టుకు ఉరేసి వీరిద్దరిని చంపారు. ఈ కేసులో చోటు, జునైడ్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరీఫ్ అనే మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా చనిపోయిన అమ్మాయిలతో స్నేహం నటిస్తూ.. బుధవారం వారిని పొలానికి రప్పించారని.. సోహైల్, జునైద్ అమ్మాయిలపై అత్యాచారం చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితులను, బాలికలు పెళ్లి చేసుకోవాలని కోరడంతో సోహైల్, హఫీజుల్, జునైద్ గొంతు కోసి చంపారని.. కరీముద్దీన్, ఆరీఫ్ ఇద్దరు బాలికను ఉరితీశారిన ఎస్పీ సంజీవ్ సుమన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం లఖీంపూర్ జిల్లా నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ పూర్ గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.