Kishan Reddy : ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే.. నేడు 2 గంటల 15 నిమిషాలు పాటు చార్మినార్ నుండి జంట నగరాలలోని పలు ప్రాంతాల గుండా అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ బైక్ ర్యాలీ లో వందలాది మహిళలు పాల్గొన్నారు. కాషాయ వస్త్రాలు, కాషాయ పగిడి ధరించి.. జాతీయ జెండాలతో ర్యాలీలో మహిళలు పాల్గొన్నారు. ర్యాలీనీ ప్రారంభించి చివరి వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఊరేగింపులో పాల్గొన్నందుకు మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనడం… మీకు ఇదే మొదటి సారి కావొచ్చు… బైక్ నడిపి చేతులు నొప్పి పెట్టీ ఉంటాయని కిషన్‌రెడ్డి మహిళలను ఉద్దేశించా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నిజాంను లొంగదీసుకోని అనాడు హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేశారు.
74 ఏళ్ల తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా తిరిగి నగరం నడిబొడ్డున జాతీయ పతాకాన్ని ఎగర వేయనున్నారని, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగవేయాలన్నారు. బురుజులు ఉన్న గ్రామాలపై జాతీయ పతాకం ఎగర వేయాలని, హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయ్యి 74 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. ఇందులో భాగంగా ఏడాది పాటు విమోచన దినోత్సవ వేడుకలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, అజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలుగు వారైన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ఘంటశాల, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్నారు. అజాది కా అమృత్ మహోత్సవాల్లో వలే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఏడాది పొడవునా తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Also Read
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!