ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తూనే.. కేబినెట్‌లో మార్పులు చేర్పులపై కూడా మంతనాలు జరిగినట్టుగా తెలుస్తోంది.. రెండు రోజుల పర్యటన కోసం.. నిన్న ఢిల్లీ చేరుకున్న యోగి.. ప్రధాని మోడీతో సమావేశం తర్వాత.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.. అయితే, గత కొంతకాలంగా యోగి తన కేబినెట్‌ను విస్తరించనున్నట్టు ప్రచారం సాగుతోంది… ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగలగా.. కరోనా కట్టడి చర్యల్లో విఫలం అయ్యారని సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు ఎదురైన అనుభవాలే చెబుతున్నాయి.. మరోవైపు, గంగా నదిలో కోవిడ్‌తో చనిపోయివారి మృతదేహాలు కూడా.. యోగికి తలనొప్పిగా మారాయి.. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసేందుకు కొద్దిరోజులుగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. యోగి సర్కార్‌లోని మంత్రులు, నేతల అభిప్రాయాలను కూడా సేకరించి వ్యూహరచన చేస్తున్నారు.. అందులో భాగంగానే.. కేంద్రం పెద్దలను యోగి కలిసినట్టుగా సమాచారం.