ఉత్తరాఖండ్‌లోని వరదలు, అందుతున్న సాయం పై పరిశీలించేందుకు నేడు అమిత్ షా వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటికే కొండ చరియలు విరిగిపడి శిథిలాల కింద చిక్కుకున్న 42 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దమానీ వరద నష్టాన్ని మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పుష్కర్ సింగ్ ఫోన్‌లో మాట్లాడి సహాయాన్ని అడిగారు. అటు ఎన్డీఆర్ఎఫ్ సహయక చర్యలను ముమ్మరం చేసింది.