Site icon NTV Telugu

Jaishankar: ‘‘పాకిస్తాన్ దాడుల గురించి యూఎస్ హెచ్చరిక’’.. అందుకే భీకర దాడులు చేశాం..

Jaishankar

Jaishankar

Jaishankar: పాకిస్తాన్‌తో ఇటీవల నెలకున్న ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు వివరించారు. ఉద్రిక్తతల గురించి విదేశాలకు చాలా సులభంగా వివరించిందని.. ‘‘వారు కాల్పులు జరుపుతారు, మేము కాల్పులు జరుపుతాము, వారు ఆగిపోతే మేము ఆగిపోతాము’’ అని చెప్పామని జైశంకర్ చెప్పినట్లు సమాచారం. ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పాకిస్తాన్ భారత్‌పై పెద్ద దాడికి సిద్ధమవుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, నిఘా వర్గాల సమాచారం అందించినట్లు వెల్లడించారు.

Read Also: Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..

‘‘పాకిస్తాన్ పెద్ద దాడికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే, భారత్ తీవ్రమైన దాడులు చేసిందని, పాక్ పెద్ద దాడికి ప్రయత్నిస్తే అంతే బలమైన ప్రతిదాడికి సిద్ధంగా ఉండాలి’’ అని జైశంకర్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ ప్రకటన, రెండు దేశాల సైనిక స్థాయిలో జరిగిందని, దీంట్లో ఏ విదేశీ మధ్యవర్తిత్వం లేదని జై శంకర్ స్పష్టం చేశారు. టర్కీ, అజర్ బైజాన్ మాత్రమే పాకిస్తాన్‌కి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని ఆయన వెల్లడించారు. భారత దేశానికి చాలా దేశాలు మద్దతుగా నిలిచాయని, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని సమర్థించాయని అన్నారు. చైనాకు పాక్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ సమయంలో పాకిస్తాన్‌కి చైనా స్పష్టమైన మద్దతు ఇవ్వలేదని జైశంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version