US warns Indian students: భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, భారత విద్యార్థులకు హెచ్చరిక చేసింది. అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే డిపోర్ట్ చేస్తామని చెప్పింది. అమెరికా వీసా ‘‘ప్రత్యేక హక్కు కాదు’’ అని యూఎస్ మిషన్ స్పష్టంగా చెబుతోంది. అమెరికాలో ఉన్న సమయంలో చట్టాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని పేర్కొంది.
Read Also: CM Chandrababu: వైఎస్ జగన్ అక్రమాలు విచారించాలంటే 30 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
“అమెరికా చట్టాలను ఉల్లంఘించడం వల్ల మీ విద్యార్థి వీసాపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీరు అరెస్టు చేయబడితే లేదా ఏదైనా చట్టాలను ఉల్లంఘిస్తే, మీ వీసా రద్దు చేయబడవచ్చు, మిమ్మల్ని బహిష్కరించవచ్చు, భవిష్యత్తులో US వీసాలకు మీరు అనర్హులు కావచ్చు. నియమాలను పాటించండి, మీ జర్నీని ప్రమాదంలో పడేయకండి. US వీసా అనేది ఒక ప్రత్యేక హక్కు, హక్కు కాదు” యూఎస్ రాయబార కార్యాలయం ఒక ట్వీట్‌లో చెప్పింది
ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత వీసా నిబంధనలు, అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. విద్యార్థి వీసా ప్రక్రియకు అధిక రుసుముతో పాటు, తప్పనిసరిగా సోషల్ మీడియా తనిఖీలు చేపడుతున్నారు. స్టూడెంట్స్ స్టేపై ప్రతిపాదిత సమయ పరిమితితో పాటు అనేక చర్యలు తీసుకున్న తర్వాత, తాజాగా ఈ హెచ్చరికలు వచ్చాయి. ఈ మార్పులు అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు.
