అమెరికా రాయబారి సెర్గియో గోర్ ముంబైలో పర్యటిస్తున్నారు. రాయబారిగా తొలి పర్యటన కోసం ముంబైకు వచ్చారు. పర్యటనలో భాగంగా శనివారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సమావేశం అయ్యారు. జనవరి 12న భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ బాధ్యతలు స్వీకరించారు. ఇన్ని రోజుల తర్వాత వీరిద్దరి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. మావో కమాండర్ పాపారావు హతం
ఇక సంజయ్ మల్హోతాను కలిసిన ఫొటోలను సెర్గియో గోర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మల్హోత్రాను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. యూఎస్ సాంకేతికతతో సహా పెరిగిన సహకార రంగాలపై చర్చించినట్లుగా రాసుకొచ్చారు.
సెర్గియో గోర్ శుక్రవారం ముంబై పర్యటనకు వచ్చారు. తొలి పర్యటనలో భాగంగా అక్కడ అమెరికా కాన్సులేట్‌ను సందర్శించారు. తొలి కాన్సులేట్ పర్యటన కోసం ముంబైకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. యూఎస్-భారతదేశం భాగస్వామ్యం బలోపేతం కోసం తమ బృందం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇక బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాయబారిగా నియమితులైన పత్రాలను అందజేశారు.
సెర్గియో గోర్.. ట్రంప్ సన్నిహితుడు. భారత్‌లో రాయబారిగా నియమితులయ్యారు. ఇక బాధ్యతలు స్వీకరించాక సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్ పుంజుకుంది. అప్పటి వరకు నష్టాల్లో ఉన్న సూచీలు.. ఒక్కసారిగా గ్రీన్‌లోకి వచ్చాయి. భారత్-అమెరికా మధ్య ఉన్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌కు మంచి ఊపునిచ్చాయి. త్వరలోనే ట్రంప్ భారత్ పర్యటనకు కూడా వస్తారని చెప్పారు.
Very much enjoyed meeting @RBI Governor Sanjay Malhotra. We discussed areas of increased cooperation, including new state-of-the-art U.S. technology. pic.twitter.com/07b2u74w74
— Ambassador Sergio Gor (@USAmbIndia) January 17, 2026
Excited to kick off my first visit to Mumbai with a visit to our Consulate! Our dedicated team in @USAndMumbai are working hard to bolster the U.S.-India partnership. 🇺🇸🇮🇳 pic.twitter.com/SOAzpp5PxM
— Ambassador Sergio Gor (@USAmbIndia) January 16, 2026