UPSC: ఢిల్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ తేదీ మార్పు.. ఎప్పుడంటే..!
- ఢిల్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ తేదీ మార్పు
- వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఎస్సీ అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన పర్సనాలిటీ టెస్ట్ ఫిబ్రవరి 8కు మార్చబడినట్లు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.

Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ పర్సనాలిటీ టెస్ట్ జనవరి 7న ప్రారంభమైంది. ఏప్రిల్ 17, 2025న ముగుస్తుంది. ఇంటర్వ్యూలో మొత్తం 2,845 మంది అభ్యర్థులు పాల్గొంటారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5న కూడా టెస్ట్ ఉంది. అయితే అదే రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ ఇంటర్య్వూ తేదీని మార్పు చేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8కు మార్చింది. ఈ మేరకు వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొంది. పర్సనాలిటీ టెస్ట్ రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం సెషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ప్రయాణ ఖర్చుల రీయింబర్స్మెంట్కు అర్హులు. సెకండ్/స్లీపర్ క్లాస్ రైలు ఛార్జీలకు (మెయిల్ ఎక్స్ప్రెస్) మాత్రమే పరిమితం.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న (శనివారం) విడుదల కానున్నాయి. దేశ రాజధానిలో జరిగే ఎన్నికలు కాబట్టి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడు కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నం చేస్తోంది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..