UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ
- దీపావళి వరకు వాయిదా
- పండుగల నేపథ్యంలో చెల్లింపులు వాయిదా
- దీపావళి తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న యూపీఐ చెల్లింపులు వాయిదా పడ్డాయి. కీలక పండుగల నేపథ్యంలో కొత్త ఛార్జీలు వాయిదా పడ్డాయి. దీపావళి వరకు వాయిదా వేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మంగళవారం తెలిపింది. రూ.2,000కు మించిన కొన్ని యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే ప్రతిపాదనను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు ప్రకటించింది. పండుగ సీజన్లో వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 13న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే చెల్లింపులపై MDR ఛార్జీలను దీపావళి తర్వాత వెంటనే అమలు చేయాలని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలు ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నది మాత్రం స్పష్టం చేయలేదు. ఎంపిక చేసిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే పండుగ సీజన్లో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో.. వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ సంస్థలు, చెల్లింపుల సేవల కంపెనీలు అమలును వాయిదా వేయాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో NPCI ప్రతిపాదనను వాయిదా వేయడంపై పరిశీలన జరిపింది.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ప్రతిపాదిత విధానం ప్రకారం.. ఎంపిక చేసిన రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం MDR ఛార్జీ విధించే అంశం ఉంది. ఉదాహరణకు, రూ.10,000 చెల్లింపుపై 0.4 శాతం లెక్కన రూ.40 ఛార్జీ అవుతుంది. అయితే ఈ ఛార్జీలు అన్ని యూపీఐ లావాదేవీలకు వర్తిస్తాయని భావించకూడదు. NPCI ప్రకటన ప్రకారం ఇవి ఎంపిక చేసిన వ్యాపార చెల్లింపులకు మాత్రమే సంబంధించినవి. ఏ రకమైన లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి? ఏ వ్యాపార వర్గాలకు ఏ రేట్లు అమలు చేస్తారు? వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
- Tags
- MDR Charges
- NPCI
- UPI charges
తాజావార్తలు
-
Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
CMR Jewellery: గాజువాకలో CMR జువెలరీ షోరూం.. ఘనంగా ప్రారంభించిన భాగ్యశ్రీ బోర్సే.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
ట్రెండింగ్
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!