Triple Talaq: సోదరుడికి కిడ్నీ దానం చేసినందుకు.. భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triple Talaq: అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరుడికి కిడ్నీ దానం చేసిన మహిళకు, ఆమె భర్త వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సదరు మహిళ భర్త సౌదీ అరేబియాలతో పనిచేస్తుండగా.. భార్య ఉత్తర్ ప్రదేశ్ లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. మహిళ సోదరుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతుండటంతో అతడిని రక్షించేందుకు ఆమె తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయమే ఆమె వివాహాన్ని విచ్ఛిన్నం చేసింది.
కిడ్నీ దానం గురించిన సమాచారాన్ని తన భర్తకు తెలియజేసిన వెంటనే.. అతను వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. మహిళ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2019లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్ట, రాజ్యంగ విరుద్ధమని ప్రకటించింది.
Also Read
Read Also: Loan App: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
ముస్లిం మహిళల హక్కుల కోసం కేంద్రం ట్రిపుల్ తలాక్‌ని నిషేధించింది. ఎవరైనా తన భార్యకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇస్తే నేరంగా పరిగణించబడుతుంది. నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తుంది. ముందుస్తు బెయిల్ ఇవ్వడానికి ముందు ఫిర్యాదు చేసిన మహిళను కోర్టు విచారిస్తే, అటువంటి కేసుల్లో బెయిలు మంజూరుకు ఎలాంటి అడ్డంకులు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్‌లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!