Online Love: సరిహద్దు దాటిన ప్రేమ.. లవర్ కోసం పాకిస్తాన్ వెళ్లిన వ్యక్తి అరెస్ట్..
- ప్రేమించిన మహిళ కోసం సరిహద్దు దాటిన వ్యక్తి..
- యూపీ వ్యక్తిని అరెస్ట్ చేసిన పాకిస్తాన్ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Love: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి తన ప్రేయురాలిని కలిసేందుకు భారత్-పాక్ సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి వెళ్లి అరెస్ట్ అయ్యాడు. యూపీ అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పాకిస్తాన్‌కి చెందిన మహిళతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారి సరిహద్దులు దాటేలా చేసింది. ప్రేమించిన యువతిని కలిసేందుకు ఏకంగా పాకిస్తాన్లోకి వెళ్లాడు. నాగ్లా ఖట్కారీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల బాదల్ బాబుని పాకిస్తాన్ పంజాబ్ పోలీసులు మండి బహౌద్దీన్ నగరంలో అరెస్ట్ చేశారు.
Read Also: March 2024 Movie Roundup: టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు ప్రతిమ.. నలుగురు హీరోయిన్ల పెళ్లి!
Also Read
ప్రేమించిన మహిళ కోసం, ఆమెని వ్యక్తిగతంగా కలవాలనే తపనతో వీసా, ప్రయాణ పత్రాలే లేకుండా దేశంలోకి ప్రవేశించినట్లు విచారణలో బాబు ఒప్పుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 27న బాబుని అరెస్ట్ చేశారు. అతడిపై పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 13 మరియు 14 కింద కేసు నమోదు చేసి, తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. జనవరి 10, 2025న మరోసారి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది.
యూపీ వ్యక్తి గతంలో రెండు సార్లు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని ప్రాథమిక విచారణలో తేలింది. మూడో ప్రయత్నంలో సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోని మండి బహౌద్దీన్ చేరుకున్నాడు. అక్కడ తాను ప్రేమించిన మహిళని కలుసుకున్నాడు. అతను పాకిస్తాన్‌కి రావడంలో ప్రేమ కోణం ఉందా..? లేక మరేదైనా విషయం దాగి ఉందా అనే కోణంలో అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Cancer Injection: భారత్‌లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!