UP, Maharashtra Legislative Council Election Results: ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ హావా కనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. తాజాగా శాసనమండలి జరిగిన ఎన్నికల్లో కీలక విజయం సొంతం చేసుకుంది బీజేపీ. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని గెలుచుకుంది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. సమాజ్ వాదీ పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కించుకోవాలనే ఆశలను బీజేపీ దెబ్బకొట్టింది.
Read Also: EzriCare Eye Drops: ఇండియన్ కంపెనీకి చెందిన ఐడ్రాప్స్‌తో అమెరికాలో ఒకరి మరణం.. రీకాల్ చేసిన కంపెనీ
మండలిలో మూడు గ్రాడ్యుయేట్స్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీలకు జనవరి 30న పోలింగ్ నిర్వహించగా శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. 100 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సమాజ్‌వాదీ పార్టీకి తొమ్మిది మంది సభ్యులను కలిగి ఉంది. అయితే ప్రతిపక్ష హోదా పొందాలంటే మరొ ఎమ్మెల్సీ అవసరం. కాగా తాజా ఎన్నికల్లో ఎస్పీ ఒక్క స్థానాన్ని కూడా గెలుపొందలేదు. తాజా గెలుపుతో మండలిలో బీజేపీ బలం 79కి చేరింది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మాత్రం అధికార బీజేపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి మూడు స్థానాలను గెలుచుకుంది. కేవలం ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ముఖ్యంగా బీజేపీ కంచుకోట, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సొంత గడ్డ నాగ్ పూర్ లో బీజేపీ ఓడిపోయింది. అమరావతి ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ నుంచి ఎంవీఏ కూటమి గెలుచుకుంది.
