Aadhaar Mobile Number: మీ ఆధార్‌కి వేరొకరి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా?.. చిక్కుల్లో పడినట్లే!
- మీ ఆధార్‌కి వేరొకరి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా?
- చిక్కుల్లో పడే ఛాన్స్
- సంచార్ సాథి వెబ్ సైట్ కి వెళ్లి ఇలా బ్లాక్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారింది. ఐడెంటిటీ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అవుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతుంటారు. ఇదిలా ఉంటే.. మొబైల్ యూజ్ చేస్తున్నవారు సిమ్ కార్డు కోసం తమ ఆధార్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు పొరపాటున వేరొకరి ఫోన్ నెంబర్ కు లింక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
కొన్నిసార్లు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. జైలు శిక్షకు కూడా గురికావాల్సి ఉంటుంది. ఎందుకంటే.. మీ ఆధార్ తో వేరొకరి ఫోన్ నెంబర్ కనెక్ట్ అయ్యి ఉంటే ఆ వ్యక్తులు క్రిమినల్స్ అయ్యుంటే అప్పుడు మీరు కూడా చిక్కుల్లో పడతారు. ఆ వ్యక్తి చేసే నేర కార్యకలాపాలకు మీరు బాధ్యతవహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ న్యూ సిమ్ కార్డ్ కొనుగోలు నిబంధనలను కఠినతరం చేసింది. మోసాలు, ఫేక్ కాల్స్ ను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
కాబట్టి మీ ఆధార్ కార్డుతో ఏయే నెంబర్స్ లింక్ అయి ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమం. కొన్ని సందర్భాల్లో మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎక్కడైనా పోగొట్టుకుని ఉండొచ్చు. కాబట్టి మీ ఆధార్ తో వేరొకరి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే వెంటనే బ్లాక్ చేయడం బెటర్. మరి దీని కోసం మీరు చేయాల్సింది ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథి పోర్టల్ ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీ ఆధార్ కార్డుతో ఏయే నెంబర్లు లింక్ అయి ఉన్నాయో తెలుసుకుని మీవి కాని నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.
మీ ఆధార్ తో లింక్ అయిన వేరొక నెంబర్ బ్లాక్ చేయడానికి..
- సంచార్ సాథి అధికారిక వెబ్ సైట్ https://www.sancharsaathi.gov.in/ ను సందర్శించాలి.
- తర్వాత సిటిజన్-సెంట్రిక్ సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు TAFCOP ను ఎంచుకోవాలి.
- తర్వాత మీ ఫోన్ నెంబర్, క్యాప్చా, ఓటీపీని ఎంటర్ చేయాలి.
- అప్పుడు మీ ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నంబర్ల లిస్ట్ కనిపిస్తుంది.
- అందులో మీ నంబర్ కాని దాన్ని ఎంచుకుని నాట్ మై నంబర్ పై క్లిక్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!