Maha Kumbh Mela 2025: స్నానం ఆచరించిన యూపీ కేబినెట్.. కొద్దిసేపు జలకలాట
- మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన యూపీ కేబినెట్
- కొద్దిసేపు జలకలాట లాడిన సీఎం యోగి, మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, కేబినెట్ మంత్రులు త్రివేణి సంగమంలో బుధవారం పవిత్ర స్నానాలు ఆచరించారు. అంతకముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి స్నానం చేశారు. అంతేకాకుండా కొద్దిసేపు ఒకరిపై ఒకరు నీళ్లు జల్లుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనేకమైన ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. గంగానదిపై ఆరు లైన్ల వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రయాగ్‌రాజ్-చిత్రకూట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. ప్రయాగ్‌రాజ్ మరియు పరిసర ప్రాంతాల స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాగ్‌రాజ్‌ని మిర్జాపూర్, భదోహి, కాశీ, చందౌలీకి కలుపుతూ.. ఘాజీపూర్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేస్తూ గంగా ఎక్స్‌ప్రెస్‌వే పొడిగింపును చేపట్టబడుతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం అనంతరం చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, 54 మంది మంత్రులతో కూడిన రాష్ట్ర మంత్రివర్గం పవిత్ర స్నానాలు చేశారు. ఇలా చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
प्रयागे तु नरो यस्तु माघस्नानं करोति च।
न तस्य फलसंख्यास्ति शृणु देवर्षिसत्तम।।महाकुम्भ-2025, प्रयागराज में मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान… https://t.co/SrkEhXNsU6
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
तत्राभिषेकं यः कुर्यात् संगमे शंसितव्रतः।
तुल्यं फलमवाप्नोति राजसूयाश्वमेधयोः॥एकता, समता और समरसता के महासमागम, भारतीयता और मानवता के महोत्सव, महाकुम्भ-2025, प्रयागराज में आज अपने मंत्रिमंडल के मा. सदस्यों के साथ पवित्र त्रिवेणी संगम में पावन स्नान का सौभाग्य प्राप्त हुआ।
माँ… pic.twitter.com/W9er56u5FD
— Yogi Adityanath (@myogiadityanath) January 22, 2025
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!