ఆ మోజు ఉంటే చంద్రబాబు రాజీనామా చేయాలి-రోజా

ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొంత ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నకల మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు సభలు, సమావేశాలు, రాజకీయా నేతల పర్యటనలతో హీట్‌ పెంచుతున్నారు.. కోవిడ్‌ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గినా.. స్టేట్‌మెంట్లు, ఆరోపణలు, విమర్శలతో మాత్రం హీట్ పెంచుతూనే ఉన్నారు.. అయితే, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఇవాళ తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ముందస్తూ ఎన్నికల పై చంద్రబాబుకి మోజు వుంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సూచించారు.

Read Also: మందుబాబులకు అలెర్ట్: ఇక, పగటిపూట కూడా డ్రంక్‌ అండ్‌​ డ్రైవ్​ టెస్టులు..!

ఇక, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంలా ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు తిరుగుతున్నారంటూ.. టీడీపీ చీఫ్ కుప్పం పర్యటనపై సెటైర్లు వేసిన రోజా.. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కుప్పం ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ వైపే ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అంటూ ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తూ.. ఏపీ సర్కార్‌ వైఫల్యాలు, సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రి పెద్దిరెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles