Shahzad: మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
- మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
- పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లుగా నిర్ధారణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో పుట్టి దేశ ద్రోహానికి పాల్పడ్డ పాక్ గూఢచారుల భరతాన్ని అధికారులు చీల్చి చెండాడుతున్నారు. యూట్యూబర్ల ముసుగులో భారత రక్షణ సమచారాన్ని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కు చేరవేసిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాతో పాటు పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. భారత రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్.. 200 బిలియన్ డాలర్ల సాయం..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
షాజాద్ గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌కు అనేకసార్లు వెళ్లాడు. సరిహద్దు మీదగా బట్టలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. వ్యాపారం ముసుగులో భారత రహస్యాలను పాకిస్థాన్ ఐఎస్ఐకు చేరవేసినట్లుగా కనుగొన్నారు. ఐఎస్ఐ ఏజెంట్లకు షాజాద్ డబ్బు, భారతీయ సిమ్ కార్డులు అందించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఐఎస్ఐ కోసం పని చేయడానికి రాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలను పాకిస్థాన్‌కు పంపించినట్లుగా గుర్తించారు. వీళ్లందరికి వీసాలను ఐఎస్ఐ ఏజెంట్లు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీ పర్యటనపై పోలీసుల విచారణ..!
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినందుకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ‘‘ట్రావెల్ విత్ JO’’ అనే యూట్యూబ్ ఛానల్‌ను జ్యోతి మల్హోత్రా నడుపుతోంది. మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక పాకిస్తానీ ఉద్యోగితో ఆమె సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మే 13న గూఢచర్యానికి పాల్పడుతున్నాడని ఆ పాకిస్తాన్ అధికారిని భారతదేశం బహిష్కరించింది. ఇక ఆమె తన పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన కొన్ని వీడియోలను యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసింది. ‘‘పాకిస్తాన్లో భారతీయ అమ్మాయి’’, ‘‘లాహోర్‌ను అన్వేషించే భారతీయ అమ్మాయి’’, ‘‘కటాస్ రాజ్ ఆలయంలో భారతీయ అమ్మాయి’’, ‘‘పాకిస్తాన్లో లగ్జరీ బస్సులో భారతీయ అమ్మాయి ప్రయాణించింది’. ఇలా టైటిల్స్ పెట్టి అనేక వీడియోలు పోస్ట్ చేసింది. అయితే జ్యోతి మల్హోత్రా పూరీలో కూడా ప్రయాణం చేసింది. అక్కడి యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో సంబంధం కలిగి ఉంది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య ఈ అరెస్ట్‌లు జరుగుతున్నాయి. వీళ్లంతా పహల్గామ్ ఉగ్ర దాడి సమయంలో ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..