Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
- దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్
- బళ్లారి-గుంతకల్ రైల్వే మార్గ విస్తరణకు ఆమోదం
- రూ.1,264 కోట్లకు కేంద్రం ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బళ్లారి-గుంతకల్ రైల్వే మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి రూ.1,264 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వే సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టును పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పరిధిలో రూపొందించారు. బహుళ రవాణా అనుసంధానం (మల్టీ-మోడల్ కనెక్టివిటీ), లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక ప్రకారం దీనిని అమలు చేయనున్నారు. ప్రజలు, వస్తువులు, సేవల రవాణా మరింత వేగవంతంగా సాగేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
46 కిలోమీటర్ల మేర రైల్వే విస్తరణ
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టుతో భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు సుమారు 46 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు జతకానున్నాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 99 గ్రామాలకు మెరుగైన రైల్వే అనుసంధానం లభించనుంది. ఈ గ్రామాల్లో దాదాపు 7 లక్షల మంది జనాభా నివసిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ఈ రైల్వే మార్గ విస్తరణతో బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడనుంది. దీంతో పర్యాటక రంగానికీ ఊతం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్గం ద్వారా ఇనుప ఖనిజం, డోలమైట్, సున్నపురాయి, ఇనుము-ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటి కీలక వస్తువులు పెద్ద ఎత్తున రవాణా అవుతున్నాయి. కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే ఏటా అదనంగా 16.22 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుందని అంచనా.
పర్యావరణానికి మేలు
ఈ ప్రాజెక్టు అమలుతో రోడ్డు రవాణాపై ఆధారపడటం తగ్గి, రైల్వే ద్వారా సరుకు రవాణా పెరుగుతుంది. ఫలితంగా 1.32 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు, 6.67 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది సుమారు 27 లక్షల చెట్లను నాటినంత పర్యావరణ ప్రయోజనం కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం ప్రకారం.. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భారతీయ రైల్వేలో లైన్ సామర్థ్యం పెరిగి, రైళ్ల రాకపోకలు మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణా సేవలు మరింత విశ్వసనీయంగా మారనున్నాయి.

అలాగే దేశవ్యాప్తంగా మూడు ప్రత్యేక కెమికల్ పార్కుల ఏర్పాటు కోసం రూ.3,030 కోట్లతో ‘భారత్ ఔద్యోగిక వికాస్ యోజన–రసాయన్’ పథకానికి ఆమోదం లభించింది. దేశంలో రసాయన పరిశ్రమను మరింత బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంచడం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ పథకాన్ని 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రకటించగా మొత్తం రూ.3,030 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. ఇందులో రూ.3,000 కోట్లు కెమికల్ పార్కుల్లో ఉమ్మడి మౌలిక సదుపాయాల నిర్మాణానికి కేటాయించగా, రూ.30 కోట్లు పరిపాలనా ఖర్చులకు వినియోగించనున్నారు. ఈ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఐదేళ్లలో అమలు చేయనున్నారు.
ప్రతి పార్కుకు రూ.1,000 కోట్ల కేంద్ర సాయం
ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఛాలెంజ్ ఆధారిత ఎంపిక విధానం ద్వారా మూడు కెమికల్ పార్కులను అభివృద్ధి చేయనున్నాయి. ప్రతి పార్కు కోసం కేంద్రం గరిష్టంగా రూ.1,000 కోట్ల గ్రాంట్ అందిస్తుంది. అయితే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.500 కోట్లు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి కెమికల్ పార్కు ఏర్పాటుకు కనీసం 2,000 ఎకరాలు (8 చదరపు కిలోమీటర్లు) వివాదరహిత భూమి ఉండాల్సి ఉంటుంది.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
ఈ కెమికల్ పార్కుల్లో పరిశ్రమలకు అవసరమైన ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో:
కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (CETP)
ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ (TSDF)
ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు
నీటి సరఫరా వ్యవస్థ
సాల్వెంట్ రికవరీ, డిస్టిలేషన్ యూనిట్లు
ఆవిరి (స్టీమ్) పంపిణీ వ్యవస్థ
ఇంటర్‌కనెక్టెడ్ పైప్‌లైన్ నెట్వర్క్
లాజిస్టిక్స్, గిడ్డంగుల సదుపాయాలు వంటి అత్యాధునిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
పరిశ్రమలకు భారీ ఊతం
ఈ పథకం ద్వారా అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్, అనుబంధ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతాయని కేంద్రం తెలిపింది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడంతో పాటు ఉత్పత్తి వ్యయాలు తగ్గి, భారతీయ తయారీ సంస్థలు ప్రపంచ మార్కెట్లో మరింత పోటీ సామర్థ్యాన్ని సాధిస్తాయని పేర్కొంది. అలాగే దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం, ఎగుమతులు పెరగడం, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం వంటి ప్రయోజనాలు ఈ పథకం ద్వారా కలుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఉపాధి అవకాశాలు.. ‘వికసిత్ భారత్ 2047’కు ఊతం
రసాయన, పెట్రోకెమికల్ రంగాలు వ్యవసాయం, వస్త్ర పరిశ్రమ, ఔషధాలు, న్యూట్రాస్యూటికల్స్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మూడు కెమికల్ పార్కుల ఏర్పాటు ద్వారా వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనకు కూడా ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
-
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
-
TIMS : టిమ్స్‌లో ఇక సర్జరీలు.. నిమ్స్ తరహాలో తక్కువ ధరకే వైద్యం.!
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!