Udhayanidhi Stalin: ‘‘భర్త కోసం భార్య వెతుకుతోంది’’.. విజయ్‌పై పర్సనల్ అటాక్..
- కోర్టులో ‘‘భార్య భర్త కోసం వెతుకుతోంది’’..
- సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత వ్యాఖ్యలు..
- తమిళనాడు అసెంబ్లీలో హాట్ హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhayanidhi Stalin: తమిళనాడు రాజకీయాల్లో హీట్ మొదలైంది. అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి విజయ్ డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయదని, అవినీతికి తావివ్వదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందిస్తూ.. రైతుల ఆందోళనల్ని ప్రతిపక్షాలు ప్రేరేపిస్తున్నాయని చెప్పడం రైతులకు అవమానమే అని అన్నారు. చెంగల్పట్టు కోర్టులో ‘‘భర్త కోసం భార్య వెతుకుతున్న కథ’’ గురించి తెలుసని, విజయ్ ఆయన భార్య సంగీతల మధ్య విడాకుల వివాదాన్ని ఉదయనిధి ప్రస్తావించారు. వీరిద్దరి విడాకులు చంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విచారణలో ఉంది. ఆగస్టు 7న తదుపరి విచారణ జరుగుతుంది.
Also Read
అంతకుముందు, విజయ్ మాజీ సీఎం స్టాలిన్ హావభావాలను ప్రదర్శించడం వైరల్‌గా మారింది. దీనిపై ఉదయనిధి మాట్లాడుతూ.. అసెంబ్లీని థియేటర్‌గా మార్చారని, యాక్టింగ్ ఆపి పాలన చేయాలని అన్నారు. టీవీకే అసెంబ్లీని షూటింగ్ స్పాట్‌గా మార్చిందని స్పీకర్ యాక్షన్ చెబితే ముఖ్యమంత్రి నటిస్తున్నట్లుగా ఉందని అన్నారు. తర్వాత మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మాస్టర్లు కూడా వస్తారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: ‘‘భర్త కోసం భార్య వెతుకుతోంది’’.. విజయ్‌పై పర్సనల్ అటాక్..
-
Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
-
CM Vijay: పెరియార్ ఆదర్శమే, కానీ దేవుడిపైనే మా నమ్మకం..
-
France: ఫ్రాన్స్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. 18 మంది మృతి
-
Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!