మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనలో తిరుగుబాటు సంచలనమే సృష్టించింది.. చివరకు సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోయింది ఎమ్మెల్యేలే.. ప్రజలు కాదు.. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగినా.. శివసేనకు 100 సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. ఇక, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు సంజయ్ రౌత్.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగితే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 సీట్లకు పైగా గెలుస్తుందని పేర్కొన్నారు. శివసేన తరపున 100 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నామని… మధ్యంతర ఎన్నికల్లో చూసుకుందామని ఉద్ధవ్ థాక్రే చెప్పారని, అప్పుడే ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తేలుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
బాలా సాహెబ్ థాకరే పార్టీ కాబట్టి శివసేనను ఎవరూ హైజాక్ చేయలేరని అన్నారు సంజయ్ రౌత్.. శివసేన బాబా థాకరేది.. అది మరెవరికీ కాదు.. మీరు డబ్బు ద్వారా దానిని హైజాక్ చేయలేరు అన్నారు. ఇక, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం డబ్బు మాత్రమే కాకుండా మరేదైనా ఇచ్చారని వ్యాఖ్యానించారని గుర్తుచేసిన ఆయన.. అది ఏదో రివీల్ అయినప్పుడు ఇది పెద్ద ఎక్స్‌పోజ్ అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అతి త్వరలో అసలు పార్టీలోకి వస్తారని కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని మేం ఇప్పటికీ ఆశిస్తున్నాము… మేము ఎల్లప్పుడూ తిరుగుబాటుదారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని.. వారు మా ప్రజలు, తిరిగి వస్తారు.. ‘శుభ కా భూలా అగర్ షామ్ కో ఘర్ ఆ జాయే తో ఉస్సే భూలా నహీ కెహతే,’ అని పేర్కొన్నారు సంజయ్ రౌత్.
