Site icon NTV Telugu

Maharashtra: స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తూ జీవో.. ప్రతిపక్ష కూటమి అభ్యంతరం

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Shocking: ప్రియుడితో కలిసి కాబోయే భర్తపై దాడి.. పెళ్లికి 2 రోజుల ముందు కోమాలోకి..

అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా వ్యతిరేకించారు. పిల్లలపై బలవంతంగా హిందీ రుద్దడాన్ని ఏ మాత్రం సహించబోమని ఆయన వ్యా్ఖ్యానించారు. తమ పార్టీకి హిందీ భాషపై విముఖత లేదని.. అసలెందుకు బలవంతంగా హిందీ రుద్దుతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం మరాఠీ, ఇంగ్లీష్-మీడియం నేర్చుకుంటుండగా కొత్తగా చిన్న పిల్లలపై మూడో భాషగా హిందీ రుద్దాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఉద్ధవ్ థాక్రే నిలదీశారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడేట్టివార్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. హిందీ ఐచ్ఛిక భాషగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదని.. అంతేకాని తప్పనిసరి చేస్తే మాత్రం మరాఠీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వచ్చే ఏడాది నుంచే కొత్త సిలబస్‌లో మూడవ భాషగా హిందీ ఉండనుంది.

ఇది కూడా చదవండి: Gudivada Amarnath: మేయర్‌పై అవిశ్వాసం గెలిశారు.. విశాఖ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు..!

ఇప్పటికే తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వం హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏ మాత్రం త్రిభాషా సూత్రాన్ని అంగీకరించమని తేల్చింది. ద్విభాషకే తమ మద్దతు అని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై తమిళనాడులో డీఎంకే-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఈ పంచాయితీ మహారాష్ట్రకు పాకింది. ఇక్కడ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముందుందు ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.

ఇది కూడా చదవండి:Janhvi Kapoor : అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే యుద్ధాలే జరిగేవి : జాన్వీకపూర్

Exit mobile version