Uddav Thackeray: అమిత్ షా అప్పుడే అంగీకరించి ఉంటే.. సంక్షోభం తలెత్తేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం పదవిని బీజేపీ, శివసేన చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు 2019లో అమిత్ షా అంగీకరించి ఉంటే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తేదా అని ప్రశ్నించారు. శివసేనలో తిరుగుబాటు, సంకీర్ణ ప్రభుత్వం పతనం, కొత్త సర్కారు ఏర్పాటు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా, శివసేన మిత్రపక్షాలుగా ఎన్నికల్లో గెలిచి, మహారాష్ట్రలో అధికారం చేపట్టిన నాటి సంగతుల్ని గుర్తు చేశారు.
శివసేనలో తిరుగుబాటును.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంగా, ప్రజా తీర్పును కాలరాయడంగా అభివర్ణించారు. 2019 శాసనసభ ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి పోటీ చేసి గెలిచాయి. కానీ సర్కారు ఏర్పాటు విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయాయి. అనంతరం తలెత్తిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో రెండున్నరేళ్లకే కుప్పకూలింది. తనపై ఉన్న కోపాన్ని ముంబయివాసులపై ప్రదర్శించవద్దని కొత్త ప్రభుత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రే కోరారు . మెట్రో కార్ షెడ్‌ను ముంబయిలోని కంజూర్‌మార్గ్ నుంచి ఆరే కాలనీకి తరలించాలన్న ఏక్‌నాథ్ సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పర్యావరణంతో చెలగాటం ఆడకుండా మెట్రో కార్ షెడ్‌ను కంజూర్‌మార్గ్‌లోనే కొనసాగించాలని కోరారు.
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
2019లో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు హయాంలో ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్.. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లను నరకాల్సి రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పర్యావరణ కార్యకర్తలతో పాటు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత భాజపాతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019 నవంబరులో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెట్రో కార్ షెడ్‌పై ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్‌షెడ్‌ను ఆరే కాలనీ నుంచి కంజూర్‌మార్గ్‌కు తరలించారు. అంతేగాక, ఆరే కాలనీని రిజర్వ్ అటవీ ప్రాంతంగా ప్రకటించారు.
13,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నఆరే కాలనీలో 27కి పైగా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వివిధ జంతు జాతులు నివసిస్తున్నాయి. సెప్టెంబరు 2019లో బాంబే హైకోర్టు, మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం ఆరే అటవీ ప్రాంతంలో చెట్లను నరకవద్దని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వాన్ని మౌఖికంగా ఆదేశించింది, దానికి వారు అంగీకరించారు.
Supreme Court: శివసేనకు చుక్కెదురు.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!