Sharad Pawar: నాకు ప్రేమ లేఖ వచ్చింది..శరద్ పవార్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. అయితే దీన్ని ఆయన ప్రేమలేఖగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు ఐటీ నోటీసు వచ్చిందని అది ప్రేమలేఖ అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. 2004, 20009, 2014, 2020 సంవత్సరాల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి తాజాగా ఐటీ నోటీసులు జారీ చేసింది.
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏక్ నాథ్ షిండే సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే శరద్ పవార్ కు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఐటీ నోటీసులపై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ ఏజెన్సీలు కొంతమంది నేతల సమాచారాన్ని సేకరిస్తున్నాయని అన్నారు. ఈ నోటీసులపై స్పందిస్తూ పవార్ మరాఠీలో ట్వీట్ చేశారు. ఈడీ, ఐటీ నుంచి చాలా మంది శాసన సభ్యులు తమకు నోటీసులు అందాయని చెప్పారని.. ఐదేళ్ల క్రితం వరకు ఈడీ పేరు పెద్దగా ఎవరికి తెలియదని.. ఈ రోజు గ్రామాల్లో కూడీ మీ వెనక ఈడీ ఉంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
ఇప్పటికే మహా వికాస్ అఘాడీ సర్కార్ లోని మంత్రి నవాబ్ మాలిక్ మనీలాండరింగ్ వ్యవహారంలో, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా శివసేన కీలక నేత సంజయ్ రౌత్, పత్రాచాల్ భూముల కుంభకోణం కేసులో ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా శరద్ పవార్ కు ఐటీ నోటీసులు పంపింది
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!