అసోం జైళ్లలో కలకలం.. 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైళ్లలో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలిన ఘటన అసోంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది… రాష్ట్రంలోని సెంట్రల్ జైలు, నాగావ్‌లోని ప్రత్యేక జైలులో గత నెలలో ఈ కేసులు వెలుగు చూశాయి… రెండు జైళ్లలో కలిపి ఏకంగా 85 మందికి హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలడంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు.. ఇక, ఈ ఘటనపై నాగావ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ పటోర్ వివరణ ఇస్తూ.. ఖైదీల్లో ఎక్కువ మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిందన్నారు.. చాలా మంది మాదక్రవ్యాల బానిసలు జైలుకు వచ్చారని.. ఇటీవల వారికి హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తించామని వెల్లడించారు.
కాగా, బాధితుల్లో ఎక్కువ మందిని ఇంట్రావీనస్ డ్రగ్ తీసుకుంటుండగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్, 1985 కింద అరెస్ట్ చేశారు పోలీసులు.. సెంట్రల్ జైలులో 40 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు గుర్తించామని జైలర్ ప్రబిన్ హజారికా వెల్లడించారు.. అయితే, ఖైదీలకు డ్రగ్స్ అందుబాటులో లేవని, పాజిటివ్ తేలిన వారి నుంచి ఇతరులకు సోకుతుందన్న వార్తలను మాత్రం కొట్టిపారేశారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మిగతా కేసులో నాగావ్ జైలులో వెలుగుచూవాయి.. డ్రగ్స్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నాగావ్ ఎస్పీ ఆనంద్ మిశ్రా.. డ్రగ్స్, అక్రమ లైంగిక సంబంధాలు.. హెచ్ఐవీ వ్యాధి సంక్రమణకు దారి తీస్తున్నాయని.. చట్టవిరుద్ధమైన లైంగిక కార్యకలాపాల్లో పాల్డొనడం ఒకటైతే.. డ్రగ్స్ కూడా మరో కారణంగా చెప్పుకొచ్చారు.
Also Read
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
- Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
తాజావార్తలు
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..