Site icon NTV Telugu

Jammu Kashmir: కాశ్మీర్ అడవుల్లో ఇద్దరు పారా కమాండోలు మిస్సింగ్..

Kashmir

Kashmir

Jammu Kashmir: దక్షిణ కాశ్మీర్‌లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు.

Read Also: Pakistan: పాకిస్తాన్‌లో సైనిక ఆపరేషన్.. 11 మంది సైనికులు, 19 మంది ఉగ్రవాదులు హతం..

అక్టోబర్ 6 సాయంత్రం కిష్త్వార్, అనంత్ నాగ్ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్ సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. వీరి మిస్సింగ్ తర్వాత వైమానిక నిఘా, ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కఠినమైన అటవీ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ గోప్యంగా ఉన్నాయి. అయితే, ఈ అదృశ్యం వెనక ఉగ్రవాద ప్రమేయం లేదని తోసిపుచ్చుతున్నారు. ఈ ఇద్దరు జవాన్లు దారి తప్పి ఉండొచ్చని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version