Jammu Kashmir: దక్షిణ కాశ్మీర్‌లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు.