Site icon NTV Telugu

Air India: ఎయిరిండియా విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. ఎందుకో తెలుసా..?

Air India

Air India

Air India: ఎయిర్‌ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్‌ కోసం ఘర్షణకు దిగారు. అయితే, డెన్మార్క్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్ లోని ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్‌రెస్ట్‌ విషయంలో ఆ ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్వాదం జరిగింది. ఇక, విమానంలోని క్యాబిన్‌ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటును ఇచ్చారు.

Read Also: Salaar1 : సలార్ థియేటర్స్ లో సరిగా ఆడలేదు : ప్రశాంత్ నీల్

అయితే, ఆదివారం (డిసెంబర్‌22) ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయిన కాసేపటికి వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్‌ తీసుకునేందుకు తన పాత సీటు దగ్గరకు మళ్లీ వచ్చాడు. అప్పుడు ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం ప్రారంభమైంది. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు పోయింది. విమానయాన సిబ్బంది వారిని నిలువరించడంతో.. ఈ గొడవ చివరకు ఆగిపోయింది. వారు ఇద్దరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిరిండియా అధికారులు వెల్లడించారు.

Exit mobile version