Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- వరకట్న దాహానికి తెలుగు హీరోయిన్ బలి
- భోపాల్‌లోని అత్తారింట్లో శవమై కనిపించిన ట్విషా శర్మ
- భర్త, అత్తమామలపై కేసు నమోదు
- న్యాయం కోసం బాధిత కుటంబం డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ప్రస్తుతం సమాజం టెక్నాలజీలో దూసుకెళ్లిపోతున్నా.. మనుషుల్లో మాత్రం క్రూరత్వం పోవడం లేదు. తాజాగా వరకట్న వేధింపులకు ఓ తెలుగు హీరోయిన్ బలైపోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also Read
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
ట్విషా శర్మ.. తెలుగు హీరోయిన్. అంతేకాదు మాజీ మిస్ పూణె. మోడలింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినిమాతో పాటు పలు ప్రాంతీయ చిత్రాల్లో నటించింది. కానీ జీవితం వరకట్న పిశాచికి బలైపోతుందని ఊహించలేకపోయింది. భర్త, అత్తమామల వరకట్న వేధింపులకు ట్విషా శర్మ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
నోయిడాలో నివాసం ఉంటు ట్విషా శర్మకు… 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్‌సింగ్‌తో ఢిల్లీలో గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచి కూడా వేధింపులకు గురవుతూనే ఉంది. ఈ నెల 12న భోపాల్‌లోని అత్తగారింట్లో ట్విషా శర్మ విగతజీవిగా కనిపించింది.
సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విషా శర్మ తన తల్లితో వాట్సాప్‌లో చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. భర్త సమర్థ్‌సింగ్, కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురి చేశారని తల్లడిల్లింది. మరణానికి ముందు మే 7న జరిగిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ట్విషా శర్మ వాట్సాప్ చాట్ వెలుగులోకి రావడంతో.. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసనకు దిగింది. తమ కుమార్తెను చంపేసి.. ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. ట్విషా మృతి ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను తిరిగి పరీక్షించాలని ఢిల్లీ ఎయిమ్స్‌కు పోలీసులు పంపించారు.
తాజావార్తలు
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!