NTV Telugu Site icon

TVK president Vijay: ప్రస్తుత పరిస్థితులను చూసి అంబేద్కర్ తలదించుకునే వారు..

Tvk

Tvk

TVK president Vijay: అంబేద్కర్ 68వ జయంతి సందర్భంగా నిన్న చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్‌లో అంబేద్కర్ అందరికీ నాయకుడు అనే పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కార్ పైనా విమర్శలు గుప్పించారు. కాగా, మణిపూర్‌లో జరుగుతున్న హింసను ఎత్తి చూపిస్తూ.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ఈరోజు మణిపూర్‌లో ఏమి జరుగుతుందో మాకు తెలుసని టీవీకే అధ్యక్షుడు విజయ్ అన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా మనల్ని పాలిస్తున్న ప్రభుత్వం కేంద్రని ఎద్దేవా చేశారు.

Read Also: Pushpa 2: బాక్సాఫీసును రూల్ చేస్తున్న పుష్ప రాజ్.. రప రప రూ.400కోట్లు

అలాగే, తమిళనాడులోని దళితుల కోసం కేటాయించిన వాటర్ ట్యాంక్‌లో మానవ మలమూత్రాలను కలిపిన ఘటనపై డీఎంకే ప్రభుత్వంపై తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇదంతా చూసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిగ్గుతో తల వంచుకుని ఉండేవాడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.. ఆ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నాకో సందేహం అంబేద్కర్ ఈరోజు జీవించి ఉంటే నేటి భారతదేశం గురించి ఏమనుకుని ఉండేవాడు అని ప్రశ్నించారు.

Read Also: ENG vs NZ: 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో 5 లక్షలకు పైగా రన్స్ చేసిన ఇంగ్లాండ్..

ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు కీలకమని దళపతి విజయ్ నొక్కి చెప్పారు. ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహించే ఎన్నికల కమిషనర్లను ఏకాభిప్రాయంతో ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలు అన్యాయంగా జరిగాయని నేను అనడం లేదు.. కానీ, ఇప్పటి నుంచి జరిగే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయన్న నమ్మకం ప్రతి ఒక్క భారతీయుడికి ఉండాలని ఆయన తెలిపారు. తమిళనాడులో 2026లో జరిగే ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్లాన్ రెడీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి అగ్ని పరీక్ష లాంటిదని చెప్పాలి.

Show comments