Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రెండో రోజు కూడా తన హవాను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పుష్ప పార్ట్ 1.. పార్ట్ 2 పై ఎక్కడా లేని అంచనాలు క్రియేట్ చేసింది. ఎంతలా అంటే.. ఏకంగా ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసేలా చేసింది. పెరిగిన టికెట్ రేట్లతో ముందు రోజే 9.30 నిమిషాలకు ప్రీమియర్స్ షో పడడం, 12 వేలకు పైగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కావడంతో.. బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించాడు పుష్పరాజ్. వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్ ప్లస్ ఫస్డ్ డే కలుపుకొని 175 కోట్ల షేర్, 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టి.. ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఇక రెండో రోజు వర్కింగ్ డే అవడంతో.. భారీ డ్రాప్ కనిపించింది. కానీ సెకండ్ డే కూడా 150 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే 400 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది పుష్ప 2.
Read Also:Maharashtra: ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు
రెండో రోజు ఒక్క ఇండియాలోనే 90 కోట్ల నెట్ వసూలు చేసిందని తెలుస్తోంది. మొత్తంగా.. రెండ్రోజుల్లో పుష్ప 2 మూవీకి ఇండియా వైడ్గా 265 కోట్లు నెట్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే.. 400 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ఇక మూడు రోజుల్లోనే.. ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరనుంది. వీకెండ్ అవడంతో.. వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఫస్డ్ వీకెండ్‌లో పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ ఫిగర్ నమోదు చేసేలా ఉంది. మొత్తంగా.. ‘పుష్ప 2’ జోరు చూస్తే వెయ్యి కోట్లు రాబట్టడం పెద్ద మ్యాటరే కాదన్నట్టుగా ఉంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా 1200 కోట్ల వరకు వసూలు చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు పుష్పగాడు. ఫస్డ్ డే 72 కోట్లతో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప 2.. ఒక్క బాలీవుడ్‌లోనే మొత్తంగా 500 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. అంచనాలకు తగ్గట్లే వసూళ్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2.
Read Also:TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్ సేవలు..