Turtuk: భారత్‌లో చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్‌లో ఉండేదని ఎంత మందికి తెలుసు. 1971 ఇండో పాక్ యుద్ధం తర్వాత పాక్ భూభాగంలోని ఈ గ్రామం భారత్‌లో చేరింది. ఇప్పుడు, ఈ గ్రామం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ గ్రామమే భారత్-పాక్ సరిహద్దుల్లోని ‘‘తుర్టుక్’’. లడఖ్‌లోని నుబ్రా లోయలో, ష్యోక్ నది ఒడ్డున ఉన్న ఈ అందమైన గ్రామానికి టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాల్టి సంస్కృతికి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మేనల్లుడు సంచలన ఆరోపణలు.. బలవంతం చేశారు..!
నియంత్రణ రేఖ(LOC)కి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రారంభంలో, ఈ గ్రామం పాకిస్తాన్‌లో భాగంగా ఉండేది. 1971 భారత్ పాక్ యుద్ధంలో భారత సైన్యం ఈ గ్రామాన్ని మన దేశంలో కలిపేశాయి. ఈ గ్రామం బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఇది పాకిస్తాన్ గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో భాగంగా ఉండేది. యుద్ధం సమయంలో భారత భద్రత దృష్ట్యా పాకిస్తాన్‌కు మళ్లీ ఈ గ్రామాన్ని అప్పగించలేదు. ఆ తర్వాత భారత్‌లో భాగంగా మారింది. ఇక్కడి ప్రజలు హిందీ, బాల్టి, లడఖి వంటి భాషల్ని మాట్లాడుతారు.
2010లో ఈ గ్రామానికి పర్యాటకుల్ని అనుమతించడం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రస్తుతం హోమ్ స్టేలు, గెస్ట్ హౌజ్‌లు పెరిగాయి. పర్యాటకుల కోసం ఈ గ్రామం కూడా సిద్ధంగా ఉంది. బాల్టి సంస్కృతి ప్రజలతో నివసించే అవకాశం లభిస్తుంది. అయితే, పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే లెహ్ అధికారుల నుంచి ‘‘ఇన్నర్ లైన్ పర్మిట్’’ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామంలో పాత రాతి ఇల్లు, 300 ఏళ్ల నాటి జామా మసీదు, స్థానిక బాల్టి మ్యూజియం, ఆప్రికాట్ తోటలు ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అనువైన కాలం. ఇది లేహ్ నుంచి 205 కి.మీ. ఉంటుంది.
