Site icon NTV Telugu

Donald Trump: భారత్‌పై ‘‘జార్జ్ సోరోస్’’ కుట్రని వెల్లడించిన ట్రంప్..

Trump Soros

Trump Soros

Donald Trump: ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా పేరున్న అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారతదేశాన్ని అస్థిరపరిచేసందుకు సోరోస్ కుట్ర పన్నినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సహా బంగ్లాదేశ్‌తో పాటు అనేక దేశాల్లో అశాంతిని రేకెత్తించడానికి ఉపయోగించేందుకు, సోరోస్‌తో అనుబంధం ఉన్న అనేక సంస్థలకు నిధులు సమకూర్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్యకలాపాల కోసం ఈ సంస్థలు 26 కోట్ల డాలర్లను అందుకున్నట్లు తేలింది. సోరోస్ ఈ నిధులతో ఆయా దేశాల్లో అశాంతిని, రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ఉపయోగించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

‘‘ సోరోస్ 270 మిలియన్ డాలర్లు అందుకున్నాడు. ఈ డబ్బుని శ్రీలంక, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, పాకిస్తాన్, బ్రిటన్, ఇండియా, అమెరికాలలో అశాంతి, రాజకీయ సంక్షోభం, రాజకీయ ప్రయోజనాలకు కోసం ఉపయోగించాడు’’ అని ఎక్స్ వేదికగా ట్రంప్ వెల్లడించారు. పలు దేశాలకు యూఎస్ఎయిడ్‌ని నిలిపేసిన తర్వాత ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.

Read Also: Bunny Vasu: కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !

గత 15 ఏళ్లలో USAID సోరోస్‌తో అనుబంధంగా ఉన్న సంస్థల సమన్వయంతో 270 మిలియన్ డాలర్లకు పైగా నిధులను సమకూర్చిందని నివేదికలు సూచించాయి. ఈస్ట్-వెస్ట్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, సోరోస్ సంస్థ అయిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తుంది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ వాదనలకు మద్దతు ఇచ్చాడు. యూఎస్ఎయిడ్ వివాదాస్పద ప్రాజెక్టని చెప్పారు.

ఇదిలా ఉంటే, ఇదే తరహా వాదనల్ని భారత్, ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటి నుంచో లేవనెత్తుతోంది. భారత్‌ని అస్థిరపరిచేందుకు, అనవసర నిరసనలు, ఆందోళనలకు జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నట్లు ఆరోపించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో.. బీజేపీ ఎంపీలు జార్జ్ సోరోస్‌ సంస్థలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఉన్న సంబంధాలను ప్రశ్నించారు.

Exit mobile version