Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు

  • భారత నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి..
  • సంచలన ఆరోపణ చేసిన ట్రంప్..
Trumpfire

Trumpfire

Donald Trump: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్న భారతీయ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడం ‘‘పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’’ అని అన్నారు. శుక్రవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత నౌకలపై దాడులతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిపాదిత ఒప్పందం విషయంలో కూడా ట్రంప్ స్పందించారు. ఇరాన్ విడుదల చేసిన ఒప్పంద వివరాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని, నిజమైన ఒప్పందంలోని అంశాలు కాదని ఆయన అన్నారు. ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం, వారు అత్యంత విశ్వసనీయత లేని భాగస్వాములు, వెంటనే తమ వైఖరిని మార్చుకోవాలి అని ట్రంప్ హెచ్చరించారు.

ఈ వారం ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ఉన్న మూడు నౌకలపై దాడి జరిగింది. ఈ దాడులపై భారత్ తీవ్రంగా స్పందించిన తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, భారత నౌకలపై అమెరికా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తుండటం గమనార్హం.

ఈ ఘటనపై భారత్, అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భారతీయ వాణిజ్య నౌకలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 08న ఎంటీ మారివెక్స్ అనే నౌకపై దాడి జరగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ నౌకలో ఉన్న 24 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. జూన్ 10న ఎంటీ సెట్టేబెల్లో అనే ట్యాంకర్ ఒమన్ తీరంలో దాడికి గురైంది. ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉంటే, 21 మంది సురక్షితంగా బయటపడగా, ముగ్గురు మరణించారు. గురువారం మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది.