Trs Party: ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన అందరి అభిప్రాయాల మేరకు జరగలేదంటూ పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు గుర్రుమంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని తెలిపారు.
ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు టీఆర్ఎస్ ఎంపీలు అందించారు. ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ నోటీసులు అందించిన వారిలో ఉన్నారు. అనంతరం రాజ్యసభ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 8న రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు తెలిపారు. పార్లమెంట్ కార్యకలాపాలను, చట్ట సభను దిగజార్చేలా.. పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులను అగౌరవ పరిచేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!