కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా.. ఇద్దరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. పార్టీ తరపున పార్లమెంట్‌లో గళం వినిపించాల్సిన నేతలు.. వ్యక్తిగత విమర్శలతో రచ్చకెక్కారు. పార్టీని బజారునపడేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు కారణంగా ఇప్పటికే లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ విప్ పదవికి కళ్యాణ్ బెనర్జీ రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్ రెడీ.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్రణాళిక!
తాజాగా మరోసారి మహువా మొయిత్రాపై కల్యాణ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమెతో సమయం వృధా అని.. ఇప్పటికే శక్తిని వృధా చేసుకున్నట్లు తెలిపారు. తన శ్రద్ధకు ఆమె అర్హురాలు కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగినట్లుగా.. వైర్యం మరింత తీవ్ర స్థాయికి వెళ్లినట్లుగా అర్థమవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలపై మహువా ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె బీజేడీ ఎంపీ పినాకి మిశ్రాను వివాహం చేసుకుని హనీమూన్ మూడ్‌లో ఉన్నారు. ఇటీవలే సహచర ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీకి జెలెన్‌స్కీ ఆహ్వానం.. వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే..!
ఇక కళ్యాణ్ బెనర్జీ నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. అయితే సొంత నియోజకవర్గం శ్రీరాంపూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. మహువా మొయిత్రా కారణంగా పార్టీ సహచరుల మధ్య చెడ్డ వ్యక్తిగా ముద్ర పడినట్లుగా వాపోయారు. ఒక జూనియర్ న్యాయవాది సోదరుడి ద్వారా ప్రేరణ పొందానని.. ఇకపై ఆమె నాకు సబ్జెక్ట్ కాదని గ్రహించినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు తనకు చాలా పని ఉందన్నారు. ఇప్పటికే ఆమె కారణంగా చాలా సమయం వృధా చేసుకున్నానని.. ఆమె పట్ల శ్రద్ధ చూపడం తన తప్పు అన్నారు.
ఇది కూడా చదవండి: Tollywood strike : చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. ఫెడరేషన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యాలు
ఇక పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు కల్యాణ్ బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ‘‘నేను దీదీ (మమతా బెనర్జీ)కి వ్యతిరేకంగా కూడా మాట్లాడాను. నేను ఇలా అనకపోతే బాగుండేది అని నేను అనుకుంటున్నాను’’ అని వివరణ ఇచ్చారు. రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రితో మాట్లాడారా అని విలేకర్లు అడిగినప్పుడు.. ‘‘దీదీ నన్ను ఆశీర్వదించారు. ఒకసారి కాదు.. మూడుసార్లు” అని అన్నారు.
జూలై 4న లోక్‌సభలో తృణమూల్ చీఫ్ విప్ పదవి కళ్యాణ్ రాజీనామా చేశారు. ఎంపీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల తనను అన్యాయంగా నిందిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పార్లమెంటుకు హాజరు కాకపోయినా.. తోటి ఎంపీ చేసిన అవమానాలపై పార్టీ మౌనంగా ఉండటం తనను తీవ్రంగా బాధించిందని ఆయన భావోద్వేగంతో అన్నారు.
కళ్యాణ్ బెనర్జీ స్వచ్ఛందంగా రాజీనామా చేశానని చెప్పినప్పటికీ… ముఖ్యంగా మహువా మొయిత్రా, అంతకుముందు మాజీ క్రికెటర్, తృణమూల్ ఎంపీ కీర్తి ఆజాద్‌తో నెలల తరబడి ఉద్రిక్తతలు కారణంగా తనను బలిపశువుగా చేస్తున్నారని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.
