Shepherd Donates Land: ఊరి దాహం తీర్చేందుకు గొర్రెల కాపరి భూరి విరాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shepherd Donates Land: భూమి కోసం గొడవలు తీవ్రరూపం దాల్చి వివాదాల్లో అమూల్యమైన ప్రాణాలు పోతున్న ఈ కాలంలో ఓ గొర్రెల కాపరి గ్రామం దాహం తీర్చేందుకు తన భూమిని విరాళంగా ఇచ్చాడు. అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేనీ ఈ రోజుల్లో ఇతని దానం ఎంతో మందిలో ఆలోచనను రేకెత్తిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న దిండోరి జిల్లాలో ఓ గొర్రెల కాపరి గ్రామంలోని దీర్ఘకాల దాహార్తిని తీర్చడానికి తన భూమిని దానం చేశాడు.
57ఏళ్ల వయస్సు గల గొర్రెల కాపరి తెంకు ప్రసాద్ బన్వాసి తన మూడెకరాల స్థలంలో 1,000 చదరపు అడుగుల స్థలాన్ని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (PHE) విభాగం ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌ను నిర్మించడానికి విరాళంగా ఇచ్చాడు. దిండోరి జిల్లాలోని షాపురా బ్లాక్‌లోని బార్గావ్ గ్రామంలోని 4,500 మంది నివాసితుల నీటి కష్టాలు తీర్చడానికి స్వతహాగా ముందుకొచ్చి ఈ భూరి విరాళాన్ని అందించాడు. అతడిని దీని గురించి అడగగా.. గొప్పగా మాట్లాడాడు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
“నేను గ్రామంలోని గ్రామస్థుల పశువులను పచ్చిక బయళ్లకు మేత కోసం తీసుకెళ్తే వచ్చే జీతంతో జీవిస్తా. కుటుంబ పోషణ కోసం నాకున్న కొద్దిపాటి భూమిలో పంట పండించి కుటుంబాన్ని పోషించుకుంటాను. దీనికి ఆ భూమి ఉపయోగపడుతుంది. కానీ గ్రామస్థుల దీర్ఘకాల నీటి కష్టాల ముందు నా కుటుంబ సమస్య చిన్నగా అనిపించింది. వాటర్ ట్యాంక్ వల్ల నీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోయేలా నేను భూమిలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చాను.” అని గొర్రెల కాపరి వెల్లడించారు. గ్రామంలో నీటి సంబంధిత సమస్యలు త్వరగా తీరేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు గిరిజన గొర్రెల కాపరి ఆదివారం తెలిపారు.
PM Narendra Modi: వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ను ప్రారంభించిన ప్రధాని మోడీ
గొర్రెల కాపరి భూ విరాళంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఆ గొర్రెల కాపరిని అభినందిస్తూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. “నల్ జల్ యోజన కోసం 1,000 చదరపు అడుగుల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా తెంకు బన్వాసి గొప్ప పనిచేశారు. ఈ గొప్ప ప్రయత్నానికి నేను అతనికి నమస్కరిస్తున్నాను.” అని ముఖ్యమంత్రి ట్వీట్లో పేర్కొన్నారు. బార్గావ్ గ్రామం చాలా కాలంగా నీటి లభ్యత లేకపోవడంతో ఇబ్బంది పడుతోంది.
ముఖ్యంగా వేసవి కాలంలో, గ్రామంలోని రెండు ప్రాంతాలైన బన్వాసి మొహల్లా, శంకర్ తోలా నుంచి మహిళలు, పిల్లలు సల్గి నది నుండి నీటిని తీసుకురావడానికి 2.3 కి.మీ వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను గమనించిన బన్వాసి తన గొప్ప మనస్సుతో ట్యాంక్ నిర్మాణం కోసం భూమిని దానం చేశారు. ఇది తెలిసిన పలువురు ఆయన గొప్పతనాన్ని కొనియాడుతున్నారు.
जल ही जीवन है और प्यासे को पानी पिलाने वाले को अपार पुण्य प्राप्त होता है।
डिंडोरी के ठेंकू वनवासी ने 'नल जल योजना' के लिए पानी की टंकी के निर्माण हेतु अपनी 5 हजार स्क्वेयर फीट भूमि दान करने का वंदनीय कार्य किया है।
मैं उनके इस पुनीत कार्य के लिए हृदय से अभिनंदन करता हूं। https://t.co/cIrRyyPble
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 10, 2022
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!