Delhi: నేడు ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
- నేడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
- హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సీబీఈసీ ఛైర్ పర్సన్ హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
Also Read
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
మొత్తం 33 మంది సభ్యులతో కూడిన ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లను రద్దు చేసి సంబంధిత ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం స్లాబ్‌లోకి మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టుబాకో, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం 40 శాతం జీఎస్టీ కొనసాగనుంది. ఈ సవరణలతో ఆటోమొబైల్ రంగం ప్రధాన లబ్ధిదారు కానుంది.
ఇది కూడా చదవండి: BCCI: టైటిల్ స్పాన్సర్ వేటలో బీసీసీఐ.. ఆ కంపెనీలకు నో ఛాన్స్!
ఇక చిన్న హైబ్రిడ్ కార్లు, మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. అలాగే ఎస్యూవీ వాహనాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం జీఎస్టీని 40 శాతానికి తగ్గవచ్చని తెలుస్తోంది. ఇక ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం జీఎస్టీ తగ్గింపు వాహనాల ధరలను 6-8 శాతం వరకు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయాల వల్ల ద్విచక్రాల వాహనాల విక్రయాలు సంవత్సరానికి 10 శాతం వృద్ధి సాధించవచ్చని.. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 8 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..