భారత్ లో కొనసాగుతున్న రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ తగ్గుతూ వస్తుంది. అయితే.. పాజిటివ్ కేసులు తగ్గుతున్న… “కరోనా” మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313 కి చేరింది. ఇందులో 2,84,91,670 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,26,740 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 2,330 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,81,903 కి చేరింది. ఇక 24 గంటల్లో 1,03,570 మంది కరోనా నుంచి కోలుకున్నారు.